ENGLISH

హాట్‌ శర్మా సిస్టర్‌ ఛాన్స్‌ కొట్టేసింది

12 March 2018-13:34 PM

ముద్దుగుమ్మ నేహాశర్మ తెలుగులో 'చిరుత' సినిమాతో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాకే మెగా కాంపౌండ్‌ని టచ్‌ చేసిన ఈ ముద్దుగుమ్మకి తర్వాత ఆ స్థాయిలో అవకాశాలు రాలేదు. ఎట్‌ లీస్ట్‌ హీరోయిన్‌గా కూడా తెలుగులో నిలదొక్కుకోలేకపోయింది తర్వాత. 'కుర్రాడు' తదితర చిన్నా చితకా సినిమాల్లో నటించి, మొత్తానికి టాలీవుడ్‌కి టాటా చెప్పేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో అరకొరా ఆఫర్స్‌తో సరిపెట్టుకుంటోంది.

 

అయితే ఈ భామ సంగతిటుంచితే, ఈమె చెల్లెలు ఐషా శర్మ మాత్రం బాలీవుడ్‌ సినిమాతోనే ఆరంగేట్రం చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో ఓ మంచి సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించే ఛాన్స్‌ దక్కించుకుంది. మిలాప్‌ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్‌ అబ్రహాం, మనోజ్‌ భాజ్‌పాయ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా. తొలి సినిమాకే ఇలాంటి పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌లో నటించే ఛాన్స్‌ దక్కించుకోవడం సంతోషంగా ఉందంటోంది ఐషా శర్మ. అలాగే ఈ సినిమాతో ఐషా మంచి పేరు తెచ్చుకుంటుందంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. 

తాజాగా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన ఈ సినిమాని నిఖిల్‌ అద్వానీ, భూషణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, బ్యూటీ ఐషా శర్మ తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తానని చెబుతోంది. త్వరలోనే ఓ మంచి సబ్జెక్ట్‌తో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పబోతున్నాననీ అంటోంది. గత కొంత కాలంగా ఐషా సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో ఫాలోవర్స్‌ని పెంచుకుంటోంది. 

ఆ రకంగా ఇటు తెలుగు ప్రేక్షకులనూ, అటు హిందీ ప్రేక్షకులనూ ఒకేసారి తన అందచందాలతో ఆకట్టుకుంది. ఆ ఎట్రాక్షన్‌తోనే ముందుగా హిందీలో ఛాన్స్‌ కొట్టేసింది. ఇక తెలుగులో తెరంగేట్రం చేయడమే తరువాయి.

ALSO READ: శ్రీదేవి కోసం చెన్నైలో...