'బాహుబలి' సినిమా కోసం ప్రబాస్ తన కెరీర్‌లో దాదాపు ఐదున్నరేళ్లు కేటాయించేశాడు. అందుకుగాను ప్రతిఫలం బాగానే దక్కినా, ప్రబాస్ కెరీర్‌లో చేయదగ్గ ఇతరత్రా కేటగిరి సినిమాలను చాలానే మిస్ అయిపోయాడని చెప్పక తప్పదు. అయితే ఎట్టకేలకు 'బాహుబలి' ముసుగు తీసి, ప్రబాస్ 'సాహో' సెట్స్‌లో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే.
అసలే ప్రబాస్ ఆరడుగుల అందగాడు. ఎలాంటి యాక్షన్ అయినా షురూ చేయగలడు. డాన్సులు ఇరగదీసేస్తాడు. మాసైనా క్లాసైనా డైలాగులు ఇరగదీసేస్తాడు. అలాంటిది ఆ కటౌట్‌కి తగ్గట్లుగా అసలు సిసలు మాస్ సినిమాలు పడ్డాయంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. అలాంటిది 'బాహుబలి' సినిమా తర్వాత మన ఆరడుగుల కటౌట్ ప్రబాస్ నటిస్తున్న సినిమా 'సాహో'. బాహుబలి అంచనాలకు ధీటుగా ఉండేలా ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నది అంతగా అనుభవం లేని యంగ్ డైరెక్టర్ సుజిత్.
మొదట్లో సాదా సీదాగా స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ అంతకంతకూ వటుడింతయై అన్నట్లుగా భారీగా పెరిగిపోయింది. సబ్జెక్ట్ పరంగా, బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా.. ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలుగా భారీ బడ్జెట్ చిత్రంగా మారి కూర్చుంది. దాంతో యంగ్ డైరెక్టర్ సుజిత్ ఒక్కడే ఇంత బాధ్యతని మోయగలడో లేదోనని, ప్రబాస్ ఓ నిర్ణయం తీసుకున్నాడట. 'బాహుబలి' సినిమాతో రాజమౌళి దగ్గర మంచి అభిప్రాయం సంపాదించుకున్న ప్రబాస్, తన కోసం రాజమౌళిని ఈ సినిమాకి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వమని కోరాడట.
ప్రబాస్ కోసం, రాజమౌళి అందుకు అంగీకరించాడట. యాక్షన్ సబ్జెక్ట్స్ అంటే రాజమౌళికి ఎంతో ఇష్టం. అందుకే తనకు తోచిన ఇన్‌పుట్స్ అందించాడట 'సాహో' సినిమాకి. అలా 'సాహో'పై కూడా రాజమౌళి చేయి పడిందనీ ఇన్‌సైడ్‌సోర్సెస్ సమాచారమ్.
ALSO READ: తాత పాత్రలో మనవడు