అందాల తార శ్రీదేవి అకాలమరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక విషాద సంఘటనగా నటీనటులంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.
ఆమె గతించి రెండు వారాలు గడుస్తున్నా ఆమె కుటుంబాన్ని ఓదార్చడానికి ప్రముఖులందరూ వారి కుటుంబాన్ని సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక నిన్న శ్రీదేవి కుటుంబం చెన్నైలోని శ్రీదేవి ఇంటిని సందర్శించింది. అలాగే తమిళ చిత్రపరిశ్రమ శ్రీదేవి కోసం ఒక ‘ప్రేయర్ మీట్’ ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ మీట్ కి తమిళ సినీ తారాలోకం తరలి వచ్చింది. వచ్చిన వారిలో- భాగ్యరాజ్, రెహ్మాన్, రజినీకాంత్ భార్య లతా, సుహాసిని, మీనా, సూర్య, అజిత్, జ్యోతిక, కార్తి తదితరులు వచ్చి శ్రీదేవి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతిని తెలియచేశారు.
ఇక శ్రీదేవి కుటుంబం తరపున ఆమె తల్లిగారి వైపు నుండి అందరూ రాగా, కపూర్ కుటుంబం నుండి సంజయ్ కపూర్, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రావడం జరిగింది. అందరూ శ్రీదేవి ఆత్మకి శాంతి కలగాలని అలాగే బోనీ, జాన్వీ & ఖుషి లకి మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు.
ALSO READ: పవన్ భూమిపూజ: ఎందుకంత రహస్యం?