చాక్లెట్‌బోయ్‌లా కనిపిస్తూ, అమ్మాయిల మదిలో చెక్కిలిగింతలు పెట్టే కుర్ర హీరో నిఖిల్. కొద్ది రోజుల్లో 'కిర్రాక్ పార్టీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడీ యంగ్ హ్యాండ్‌సమ్. అయితే ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నిఖిల్ కొన్ని ఆశక్తికరమైన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
అమ్మాయిల్లో నిఖిల్‌కి ఉన్న క్రేజ్ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా. అయితే తనకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నారు? అనే విషయం నిఖిల్‌ని అడిగితే, సింపుల్‌గా తనను అర్ధం చేసుకోవాలి అంతే.. అని సమాధానమిచ్చేశాడు. అంటే అందులోనే బోలెడంత అర్ధం ఉందిలెండి. హీరో అన్నాక షూటింగ్స్ నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే హీరోయిన్స్‌తో కొంచెం ఎక్కువ క్లోజ్‌గా ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ ఓర్చుకుని, ప్రొఫిషన్‌లో ఇవన్నీ భాగం అని భర్తగా తనని అర్ధం చేసుకున్న అమ్మాయి దొరికినప్పుడు వెంటనే పెళ్లి చేసుకుంటాననీ నిఖిల్ చెబుతున్నాడు. నిఖిల్ కోసం అలాంటి అమ్మాయి ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవాలట మరి.
అంతేకాదు అమ్మాయిల విషయంలో నిఖిల్‌కి చాలా మంచి పేరుందట. 'నిఖిల్ చాలా మంచోడు' అనే ట్యాగ్‌లైన్ ఇట్టే తగిలించేస్తారట తనకు క్లోజ్‌గా ఉండే అమ్మాయిలు. ఈ సంగతి పక్కన పెడితే, 'కేశవ' వంటి సీరియస్ మూవీలో నటించిన తర్వాత నిఖిల్ కొంచెం గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఈ 'కిర్రాక్ పార్టీ'. ఈ సినిమా విజయంపై నిఖిల్ అండ్ టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి రెస్పాన్స్ అదిరిపోతోంది. ఈ నెల 16న కిర్రాక్ పుట్టించడానికి నిఖిల్ అండ్ టీమ్ ఫుల్ జోష్‌తో వచ్చేస్తున్నారోచ్.
ALSO READ: ఇంద్రజకి షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య