ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌గా బాలయ్య నటిస్తున్నాడు. అయితే ఆ ఒక్క పాత్ర తప్ప మిగిలినవన్నీ డైలామాలో పడ్డాయి.
ఎవరు ఏ పాత్రలో నటిస్తారన్న విషయంలో ఇంత వరకూ ఓ క్లారిటీ రాలేదు. అయితే ఈలోగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించబోతోందని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. ``మా ఆప్షన్లలో విద్యాబాలన్ ఒకరు. ఆమెతో చర్చలు జరుపుతున్నాం.. కానీ.. ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు`` అంటూ చిత్రబృందంలోని కీలక సభ్యుడొకరు క్లారిటీ ఇచ్చారు.
యుక్త వయసులో ఉన్న ఎన్టీఆర్‌గా ఓ యువ కథానాయకుడు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ పాత్రలో శర్వానంద్, నానిలలో ఒకరు కనిపించే అవకాశాలున్నాయి. ఈనెలలోనే ఎన్టీఆర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ALSO READ: ఇంద్రజకి షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య