ENGLISH

కొత్త బ్యూటీ కెవ్వు కేక

10 June 2017-12:02 PM

ముద్దుగుమ్మ మేఘా ఆకాష్‌ 'లై' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. నితిన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. 'అ,ఆ..' సినిమాతో స్టార్‌డమ్‌ సంపాదించిన నితిన్‌కి ఈ సినిమా భారీ బడ్జెట్‌ మూవీ అని చెప్పొచ్చు. దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో అత్యంత భారీగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. స్టైలిష్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఈ మూవీ. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ యాంగిల్‌ కూడా ఉంటుందట. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వచ్చిందని సమాచారమ్‌. తెలుగులో తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న నటిగా మేఘా ఆకాష్‌ చేసిందట. ఈ అమ్మడి గురించే ఇండస్ట్రీలో అంతా చర్చించుకుంటున్నారు. ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకుండానే అమ్మడికి ఫీడ్‌ బ్యాక్‌ అదిరిపోతోంది. తెలుగులో అభినయానికి మంచి వేల్యూ ఉంటుంది. ఇక ఆ అభినయానికి అందం తోడైతే ఆ ముద్దుగుమ్మలకు ఇక తిరుగే ఉండదు. ఆ రేంజ్‌లో మేఘా ఆకాష్‌ ఆకట్టుకోనుందని టాక్‌. నితిన్‌, మేఘా ఆకాష్‌ పెయిర్‌ కూడా చాలా బాగుందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ అంటున్నాయి. హను రాఘవపూడి తన సినిమాలో హీరోయిన్‌ని చాలా అందంగా క్యూట్‌గా చూపిస్తాడు. 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో మెహరీన్‌ పేరు మార్మోగిపోయింది. ఇదిలా ఉండగా, మేఘా ఆకాష్‌ గురించి చెబుతూ లేటెస్ట్‌గా ఆన్‌ స్క్రీన్‌ లవర్‌ని హీరో నితిన్‌ అనౌన్స్‌ చేశాడు. స్టిల్స్‌ చూస్తోంటేనే సినిమాలో రొమాంటిక్‌ యాంగిల్‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

ALSO READ: 'రారండోయ్‌..'తో నిర్మాతగా హ్యాట్రిక్‌ కొట్టిన కింగ్‌ నాగార్జున