చాలామంది కథానాయికలు అవకాశాల్లేక సినిమాలకు దూరం అవుతుంటారు. ఎవరైనా పిలిచి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. అన్నట్టు ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం చేతికి వచ్చిన అవకాశాల్ని సైతం వదులుకుంటుంటారు. నిత్యమీనన్ అదే టైపు. కొంతకాలంగా నిత్య తెలుగు తెరపై కనిపించలేదు. ఇప్పుడామె చేతిలోనూ సినిమాల్లేవు. ఇలాంటి సమయంలో ఏదైనా అవకాశం వస్తే... కళ్లకద్దుకోవాలి. కానీ. మళ్లీ కాళ్లదన్నుకుంది. టాలీవుడ్‌లో 'కరణం మల్లీశ్వరి' బయోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ బయోపిక్ లో నటించే ఛాన్స్ ముందు నిత్యనే వరించిందట. కానీ.. నిత్య ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కథ నచ్చకపోవడం వల్లో, పాత్ర నచ్చకపోవడం వల్లో కాదు, టోటల్ గా తనకు సినిమాలంటేనే ఇష్టం లేదని, అందుకే చేయడం లేదని తేల్చి చెప్పేసిందట. ఇది వరకు కూడా అంతే. కొన్ని సినిమాల్ని ఇలానే వద్దనుకుంది. మొత్తంగా చూస్తుంటే నిత్యకు సినిమాలపై పూర్తిగా ఆసక్తి తగ్గిపోయినట్టు అర్థం అవుతోంది. సినిమాల్ని వదిలేసి, కొత్త కెరీర్ ఏమైనా మొదలెడుతుందేమో చూడాలి.
ALSO READ: Nithya Menen Latest Photoshoot