ENGLISH

బ‌న్నీ హీరోయిన్ కోసం చ‌ర‌ణ్ ప‌డిగాపులు

03 June 2020-16:21 PM

ఆచార్య చిత్రానికి రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం పోషిస్తున్నాడు. న‌టుడిగా, నిర్మాత‌గా. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌పై నిర్మిస్తున్నాడు చ‌ర‌ణ్‌. ఓ కీల‌క‌మైన పాత్ర‌లోనూ క‌నిపించ‌నున్నాడు. ఒకానొక సంద‌ర్భంలో ఈ పాత్ర కోసం మ‌హేష్ బాబు ని ఎంచుకుందామ‌నుకున్నారు. కానీ.. స‌మీక‌ర‌ణ‌లు స‌రిపోక‌.. చ‌ర‌ణ్‌ని తీసుకున్నారు. అతి త్వ‌ర‌లోనే ఆచార్య సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఈలోగా చ‌ర‌ణ్ ప‌క్క‌న క‌థానాయిక‌ని ఫిక్స్ చేయాల్సివుంది. ఆచార్య‌లో చిరంజీవి పక్క‌న కాజ‌ల్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌నా ఓ క‌థానాయిక కావాలి. అందుకోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. స‌మంత‌తో పాటు చాలామంది పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. చివ‌రికి ర‌ష్మిక‌ని ఖాయం చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక‌తో చిత్ర‌బృందం సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. ర‌ష్మిక - చ‌ర‌ణ్ కాంబో కొత్త‌గా ఉంటుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. కానీ... ర‌ష్మిక ప్ర‌స్తుతం `పుష్ష‌` సినిమా ఒప్పుకుంది. ఆ సినిమా కాల్షీట్లు ఎడ్జిస్ట్ అయితే త‌ప్ప `ఆచార్య‌`కు టైమ్ కేటాయించ‌లేదు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

ALSO READ: Rashmika Mandanna Hot Photoshoot