ENGLISH

'మెంటల్‌ భామ' తక్కువదేమీ కాదు.. మీకు అర్ధమవుతోందా.?

28 January 2020-14:00 PM

'మెంటల్‌ మదిలో' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌. ఈ పాపలో విషయముందన్న సంగతి తొలి సినిమాతోనే అర్ధమైంది. ఆ తర్వాత నటించిన సినిమాల్లో సోలో హీరోయిన్‌ కాదు కానీ, డామినేటింగ్‌ రోల్స్‌లోనే కనిపించింది. తనదైన మార్కులు వేయించుకుంది. ఇక లేటెస్ట్‌గా ఈ పాప 'అల వైకుంఠపురములో..' కనిపించిన సంగతి తెలిసిందే. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రే అయినా, స్టార్‌ హీరో సినిమా కాబట్టి ఒప్పుకున్నట్లు కనిపించింది. ఒప్పుకుంటే ఒప్పుకుంది కానీ, తనలో ఇంకో యాంగిల్‌ ఉందన్న విషయం బయట పడేలా చేసుకుంది ఈ సినిమాతో.

 

ఇంతవరకూ పర్‌ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రల్లోనే కనిపించిని నివేదా పేతురాజ్‌ 'అల..' సినిమాతో తనలోని గ్లామర్‌ యాంగిల్‌ చూపించింది. 'రాములో రాములా..' పాటలో హీరోయిన్‌తో పాటు డాన్స్‌ కూడా ఇరగదీసింది. పాప టాలెంట్‌ చూసిన ఆమె ఫాలోవర్స్‌ అరెరె.. నివేదాలో ఇంత గ్లామర్‌ ఉందా.? ఇంకాస్త గ్లామర్‌ పెంచి, బన్నీతో సోలో డ్యూయెట్‌ వేస్తే ఇంకా బావుండేదే.. అని ఫీలవుతున్నారట. ఒక సీన్‌లో నివేదా మైక్రో షార్ట్‌ ధరించి బ్యాక్‌ వ్యూలో కనిపించిన సీన్‌కి అబ్బో ఫ్యాన్స్‌ ఫ్లాట్‌ అయిపోయారంటే నమ్మి తీరాల్సిందే. అలా మొత్తానికి నివేదాలోని ఆ రేంజ్‌ గ్లామర్‌ టాలెంట్‌ని గుర్తించిన క్రెడిట్‌ దర్శకుడు త్రివిక్రమ్‌కే దక్కిందనాలి. మరి ఈ గ్లామర్‌ అప్పీల్‌ని నివేదా ఇకపై కూడా కంటిన్యూ చేస్తుందేమో చూడాలిక.

ALSO READ: Nivedha Pethuraj Hot Photoshoot