ENGLISH

జై, కుశ మధ్యలో సిమ్రాన్‌

18 September 2017-18:59 PM

'జెంటిల్‌మెన్‌' సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నివేదా థామస్‌. తొలి సినిమాకే టాలెంటెడ్‌ అని ప్రూవ్‌ చేసుకుంది ఈ బ్యూటీ. నేచురల్‌ గ్లామర్‌తో తొలి సినిమాతోనే బోలెడంత అభిమానాన్ని సంపాదించేసుకుంది ఈ బ్యూటీ. ఇంత త్వరగా స్టార్‌ హీరోతో నటించే ఛాన్స్‌ రావడమంటే దానికంతటికీ నివేదా టాలెంట్‌ గొప్పతనమే అని చెప్పక తప్పదు. త్వరలోనే ''జై లవకుశ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నివేదా క్యారెక్టర్‌ ఈ సినిమాకి కీలకమట. నివేదాతో పాటు ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ రాశీఖన్నా కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే నివేదా క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఎక్కువ అని తెలియ వస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఒక పక్క జై క్యారెక్టర్‌తోనూ, మరో పక్క కుశ క్యారెక్టర్‌తోనూ కూడా రొమాన్స్‌ చేస్తుందట. అలాగే ఈ ఇద్దరితోనూ నివేదాకి సాంగ్‌ ఉంటుందట. ఆ సాంగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ అట. ఈ మాటలు చెప్పింది మరెవరో కాదు స్వయంగా ఎన్టీఆరే. అంటే అర్ధం చేసుకోవచ్చు నివేదాది ఈ సినిమాలో ఎంత ఇంపార్టెంట్‌ రోలో. కళ్యాణ్‌రామ్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆడియో ఇప్పటికే ఉర్రూతలూగిస్తోంది. ఇక సినిమా విడుదల కావడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎన్టీఆర్‌ నటిస్తున్న మూడు పాత్రల్లోనూ జై క్యారెక్టర్‌పైనే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఆ పాత్రకున్న ప్రాధాన్యత అలాంటిది మరి. అంతేకాదు జై కోసం మరో హీరోయిన్‌ ఉందట. ఆమె ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం సినిమా చూశాకే తెలుస్తాయట. అదీ సంగతి.

ALSO READ: మహేష్‌, నేను ఇద్దరం కొడతాం - ఎన్టీఆర్‌