ENGLISH

వెంకీ, రానా.. సినిమా చేయ‌డం లేదా?

19 November 2020-14:00 PM

వెంకటేష్‌, రానా క‌లిసి ఎప్పుడు న‌టిస్తారా? అని ద‌గ్గుబాటి అభిమానులు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సురేష్ బాబు సైతం చాలా క‌థ‌లు విన్నారు. కానీ.. ఏదీ సెట్ కాలేదు. అయితే ఈమ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో `నేనూ, వెంకీ బాబాయ్... క‌లిసి న‌టిస్తున్నాం..` అని చెప్పేశాడు. దాంతో.. ఈ మ‌ల్టీస్టార‌ర్ చూసే రోజు ఇంకెంతో దూరంలో లేద‌ని అనుకున్నారంతా. ఈ మ‌ల్టీస్టార‌ర్ ఎప్పుడొస్తుంది? ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అనే కొత్త ప్రశ్న‌లు సైతం రేకెత్తాయి.

 

అయితే.. వెంకీ, రానా క‌లిసి న‌టించ‌డం లేద‌ట‌. వీరిద్ద‌రూ క‌లిసి ఓ రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నార్ట‌. అది కూడా ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ రియాలిటీ షోకి సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ పూర్త‌య్యింద‌ని స‌మాచారం అందుతోంది. ఇటీవ‌ల ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ తాకిడి బాగా ఎక్కువైంది. స్టార్సంతా అటువైపు దృష్టి పెడుతున్నారు. రానా కూడా టాక్ షోల‌తో.. అనుభ‌వం సంపాదించుకున్నాడు. ఇప్పుడు త‌న అడుగు రియాలిటీ షో వైపు ప‌డ‌బోతోంద‌న్న‌మాట‌.

ALSO READ: డిసెంబ‌రు కూడా మ‌ర్చిపోవాల్సిందేనా?