ENGLISH

ల‌క్కుతోక తొక్కిన ర‌కుల్‌

19 November 2020-13:00 PM

ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ సూప‌ర్ ఛాన్స్ కొట్టేసింది. ఆమె ఖాతాలోకి ఓ బాలీవుడ్ సినిమా చేరింది. అది అలాంటి ఇలాంటి సినిమా కాదు. అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమా. బాలీవుడ్ లో మేడే అనే సినిమా ఒక‌టి రూపొందుతోంది. అమితాబ్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు. ఈ చిత్రంలో ర‌కుల్‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. ర‌కుల్ హీరోయినా? లేదంటే ఓ కీల‌క పాత్రా? అనేది ఇంకా తెలీలేదు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో ర‌కుల్ న‌టించ‌డం ఇది రెండోసారి. ఇది వ‌ర‌కు `దే దే ప్యార్ దే`లో ర‌కుల్ క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

 

`మేడే` ఈ డిసెంబ‌రులో ప‌ట్టాలెక్కుతుంది. డిసెంబ‌రు నుంచే ర‌కుల్ సెట్స్‌లో పాల్గొన‌బోతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న చిత్రంలో ర‌కుల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వైష్ణ‌వ్ తేజ్ ఇందులో హీరో. ఇది రాకుండా మ‌రో రెండు తెలుగు ప్రాజెక్టులుర‌కుల్ చేతిలో ఉన్నాయి.

ALSO READ: డిసెంబ‌రు కూడా మ‌ర్చిపోవాల్సిందేనా?