యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీతో సందడి చేస్తున్నాడు. నెక్స్ట్ వార్ 2 మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో అందరిలో మంచి ఆసక్తి నెలకొంది. ఈ మూవీకి సమాంతరంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో క్రేజీ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. ఇప్పటికే పూజా కార్య క్రమాలు పూర్తి చేశారు. కేజీఎఫ్, రెండు పార్ట్ లు , సలార్ తో పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు నీల్. ఇప్పడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరు పాన్ వరల్డ్ స్టార్స్ కలిసి వర్క్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు ప్రశాంత్ నీల్, నీల్ మూవీస్ లో హీరోయిజం, హీరో ఎలివేషన్స్ సూపర్ గా ఉంటాయి. అలాంటి మ్యాజిక్ కి ఎన్టీఆర్ తోడైతే ఎలా ఉంటుందో అన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు నీల్. ఇదొక పీరియాడిక్ డ్రామా అని, బంగ్లాదేశ్ నేపథ్యంలో కథ ఉంటుందని సమాచారం. హీరో ఫ్యామిలీ బంగ్లాదేశ్‌కు వలస వెళ్లి స్థిరపడతారు. అక్కడ హీరోకి ఎదురయ్యే పరిస్థితులే ఈ మూవీ కథ. దీనికి 'డ్రాగన్' అన్న పేరు పరిశీలనలో ఉంది.
ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకముందు సినిమాలకి పని చేసిన నీల్ టీమ్ ఈ మూవీకి కూడా రిపీట్ అవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.