ENGLISH

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్‌కు ఎన్టీఆర్..!

03 April 2025-15:34 PM

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ 'Mad Square' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ‘MAD’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ సమర్పణలో, సాయి సౌజన్య, సూర్యదేవర హారిక నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది.

సినిమా విడుదలైన నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్‌ సాధించి, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు లాభాల వర్షం కురిపిస్తోంది. తొలి వారంలోనే భారీ వసూళ్లను రాబడుతూ, త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలున్నాయి. ఈ విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి మూవీ యూనిట్ సక్సెస్ మీట్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను మరింత ప్రత్యేకంగా మార్చడానికి యంగ్ టైగర్ NTR చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్నారు. ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదిక లో జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఎన్టీఆర్ ఈ ఈవెంట్‌కు రావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. నార్నే నితిన్.. ఎన్టీఆర్‌కు బావమరిది అవ్వడం, నాగవంశీతో ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉండడం..ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరవుతున్నాడన్న వార్తతో మూవీ టీం ఇంకా ఎక్సైటెడ్ గా ఉంది. ఆయన రాకతో ఈ ఈవెంట్ మరో స్థాయిలో జరగనుంది.