ENGLISH

క‌బ‌డ్డీ కోచ్ 'పెద్ది'గా.. ఎన్టీఆర్‌?

02 February 2022-12:09 PM

ఉప్పెన‌తో అద‌ర‌గొట్టిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు. ఆ త‌ర‌వాత బుచ్చికి ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. కానీ... ముందే మైత్రీ మూవీస్ బుచ్చిని లాక్ చేసేసింది. దానికి తోడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా క‌మిట్ చేయించింది.ఎన్టీఆర్‌కి బుచ్చి ఓ క‌థ చెప్ప‌డం, అది ఎన్టీఆర్‌కి న‌చ్చ‌డం జ‌రిగిపోయాయి. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్‌. అది పూర్త‌య్యాక‌.... బుచ్చిబాబు సినిమా మొద‌ల‌వుతుంది.

 

ఈ సినిమా కబ‌డ్డీ నేప‌థ్యంలో సాగుతుంద‌ని స‌మాచారం. ఎన్టీఆర్ క‌బ‌డ్డీ కోచ్‌గా క‌నిపిస్తాడ‌ని, ఇది ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే క‌థ అని తెలుస్తోంది. ఈ సినిమాకి `పెద్ది` అనే టైటిల్ ఫిక్స్ చేశార్ట‌. ఇటీవ‌ల ఎన్టీఆర్ ని క‌లిసిన బుచ్చి ఈ క‌థ మొత్తం చెప్పేశాడు. ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

ALSO READ: దిల్ రాజు మొండిప‌ట్టు దేనికి?