ENGLISH

రూ.200 కోట్ల సినిమాలో.. రాశీ ఖ‌న్నా

02 February 2022-13:11 PM

ఈమ‌ధ్య రాశీఖ‌న్నా ప్ర‌భావం బాగా త‌గ్గిపోయింది. తెలుగులో త‌న చేతిలో ఉన్న సినిమాలు రెండే రెండు. ఒక‌టి.. థ్యాంక్యూ, మ‌రోటి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌. కాక‌పోతే... మిగిలిన భాష‌ల్లో కాస్త బిజీగా ఉంటోంది. త‌మిళంలో ఏకంగా నాలుగు సినిమాలు చేస్తోంది. హిందీలో కూడా ఒక‌ట్రెండు ఒప్పుకుంది. అయితే ఇప్పుడు త‌న ముందుకు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ వ‌చ్చింది. ఏకంగా 200 కోట్ల భారీ బ‌డ్జెట్ సినిమాలో హీరోయిన్ అయిపోయింది. విజ‌య్ సినిమాలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది.

 

విజ‌య్ - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత‌. దాదాపు 200 కోట్ల భారీ వ్య‌యంతో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. విజ‌య్ పారితోషికమే వంద కోట్ల‌ని టాక్. ఇందులో హీరోయిన్ గా రాశీఖ‌న్నా ఫిక్స‌య్యింద‌ని స‌మాచారం. విజ‌య్‌తో క‌ల‌సి న‌టించ‌డం రాశీకి ఇదే తొలిసారి. విజ‌య్ ప్ర‌స్తుతం బీస్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్తయ్యా.. వంశీ పైడిప‌ల్లి సినిమా మొద‌ల‌వుతుంది.

ALSO READ: దిల్ రాజు మొండిప‌ట్టు దేనికి?