ENGLISH

హ‌మ్మ‌య్య‌... రాధే శ్యామ్ ఫిక్స‌య్యింది

02 February 2022-13:13 PM

టాలీవుడ్ లో కొత్త రిలీజ్ డేట్లు.. వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌తీ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసేసుకుంటోంది. అయితే...రాధే శ్యామ్ మాత్రం మౌనంగానే ఉంది. దాంతో రాధే శ్యామ్ విడుద‌ల ఎప్పుడు? అనే డౌటు మొదలైంది. మార్చి 4, లేదంటే మార్చి 11న ఈ సినిమాని విడుద‌ల చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అదే నిజ‌మైంది. మార్చి 11నే ఈసినిమాని విడుద‌ల చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించిన క్లారిటీ వ‌చ్చేసింది. మార్చి 11న ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. దాంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ్యాపీ. దాదాపు 400 కోట్ల భారీ వ్య‌యంతో తెర‌కెక్కించిన పాన్ ఇండియా సినిమా ఇది. జ‌న‌వ‌రి 14న విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా కార‌ణంగా బ‌య‌ట‌కు రాలేదు.

 

ఆర్‌.ఆర్‌.ఆర్‌కీ, రాధేశ్యామ్ కీ మ‌ధ్య రెండు వారాల గ్యాప్ ఉంటే బాగుంటుంద‌ని చిత్ర‌సీమ భావించింది. దానికి త‌గ్గ‌ట్టే స‌రిగ్గా రెండు వారాల గ్యాప్ దొరికింది. మార్చి 25న‌... ఆర్‌.ఆర్‌.ఆర్ రాబోతోంది. అంటే.. రాధేశ్యామ్ కి రెండు వారాల విరామం దొరికిన‌ట్టే. రాధేశ్యామ్ విడుద‌ల‌ని బ‌ట్టి.. `గ‌ని` డేటు ఫిక్స‌వ్వాలి. మార్చి 4న రాధేశ్యామ్ రావ‌డం లేదు కాబ‌ట్టి.. ఆ ప్లేసు గ‌ని భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది.

ALSO READ: దిల్ రాజు మొండిప‌ట్టు దేనికి?