దేవర భరిలోకి దిగి అప్పుడే వారం రోజులయ్యింది. బాక్సాఫీస్ దగ్గర దేవర ఊచకోత ఎలా ఉంటుందో అని ఫాన్స్ ఆరాట పడ్డారు. వారి ఎదురుచూపుకి ఫలితం దొరికింది. దేవర బ్రేక్ ఈవెన్ అయ్యి ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ అయింది. దసరా హాలిడేస్ ని టార్గెట్ చేసుకుని 500 కోట్ల గ్రాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనితో దేవర పార్ట్ 2 పై ఆసక్తి మొదలైంది. రీసెంట్ గా దేవర మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ 'దేవర రిజల్ట్ బాగుంది, పార్ట్ 2 ఉంటుంది. ఆల్రెడీ కథ సిద్దమైపోయింది, ఓ రెండు మేజర్ సీన్స్ షూటింగ్ కూడా అయిపోయిందని' తెలిపారు.
దేవర 2 ఇంకా అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ స్ఫష్టం చేసారు. దేవర మూవీ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ కలక్ట్ చేసింది. నిన్నటికి దేవర వచ్చి వారం రోజులయ్యింది. ఈ ఏడు రోజుల్లో దేవర ప్రపంచ వ్యాప్తంగా 405 కోట్ల గ్రాస్ కలక్ట్ చేసిందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. దేవర సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ప్రస్తుతం దసరా సెలవులు వచ్చిన నేపథ్యంలో, దగ్గరలో పెద్ద సినిమాలు లేకపోవటంతో తొందరలోనే 500 కోట్ల గ్రాస్ వసూళ్లు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.