ENGLISH

త్రివిక్ర‌మ్ తప్పుకున్నాడు... బుచ్చిబాబు వ‌చ్చేశాడు!‌

06 April 2021-11:00 AM

`ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత‌... ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ కాంబోలో ఓసినిమా రావాలి. ఇది వ‌ర‌కే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి అన్నారు. అయితే.. రోజులు గ‌డుస్తున్నా ఈ సినిమా మొద‌లు కాలేదు. ఏప్రిల్ లో ఎట్టిప‌రిస్థితుల్లోనూ సినిమా మొద‌లెడ‌తామ‌ని నిర్మాత‌లు చెప్పారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

 

కొన్ని సృజ‌నాత్మ‌క విబేధాల వ‌ల్ల‌.. ఈ ప్రాజెక్టుని ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ ఇద్ద‌రూ పక్క‌న పెట్టేశార‌ని, త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ స్క్కిప్టు ప‌క్క‌న పెట్టి, మ‌రో సినిమా ప‌నిలో ప‌డిపోయాడ‌ని తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో.. ఎన్టీఆర్ కూడా బుచ్చిబాబు వైపు టర్న్ తీసుకున్నాడు. `ఉప్పెన‌`తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్‌కి ఓ లైన్ కూడా వినిపించాడు. ఆలైన్ ఎన్టీఆర్‌కి న‌చ్చినా.. త్రివిక‌మ్ సినిమా చేతిలో ఉండ‌డం వ‌ల్ల ఎన్టీఆర్ ఎలాంటి మాటా ఇవ్వ‌లేక‌పోయాడు.

 

ఇటీవ‌లే బుచ్చిబాబు ఎన్టీఆర్ ని క‌లిసి పూర్తి క‌థ వినిపించేశాడు. ఈసారి ఎన్టీఆర్ `చేసేద్దాం` అని చేతులు క‌లిపేశాడు కూడా. ఇప్పుడు త్రివిక్ర‌మ్ సినిమా దాదాపుగా ప‌క్క‌కు వెళ్లిపోయింది కాబ‌ట్టి.. బుచ్చిబాబుకి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టే.

ALSO READ: నాగ్ నన్ను గర్వపడేలా చేశారు : చిరు