ENGLISH

ఎన్టీఆర్ సినిమాకి వెరైటీ టైటిల్‌!

04 June 2020-15:29 PM

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. అందులో ఒక‌టి `ఆర్‌.ఆర్‌.ఆర్‌`. అది పూర్త‌యిన వెంట‌నే త్రివిక్ర‌మ్ తో సినిమా చేయాలి. దాని త‌ర‌వాతి సినిమా కూడా ఓకే అయిపోయింది. అది మైత్రీమూవీస్ లో ఉంటుంది. ఈచిత్రానికి `కేజీఎఫ్‌` ఫ్రేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ సినిమా మొద‌ల‌వ్వ‌డానికి క‌నీసం రెండేళ్లు స‌మ‌యం ప‌డుతుంది. ఈలోగా.. ఈసినిమా కాన్సెప్ట్, టైటిల్‌కి సంబంధించిన లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఇదో సైన్స్ ఫిక్ష‌న్ సినిమా అని తేలింది.

 

ఈచిత్రానికి `రేడియేష‌న్‌` అనే పేరు పెడ‌తార‌ని చెప్పుకుంటున్నారు. అస‌లు విష‌యం ఏమిటంటే.. ఈరోజు ప్ర‌శాంత్ నీల్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మైత్రీమూవీ మేక‌ర్స్ ప్ర‌శాంత్ కి శుభాకాంక్ష‌లు చెబుతూ `లెట్ అజ్ మీట్ ఎట్ రేడియేష‌న్ సూట్‌` అని పేర్కొంది. దాన్ని బ‌ట్టి.. ఈ సినిమా క‌థంతా రేడియేష‌న్ చుట్టూ తిరుగుతుంద‌ని, సినిమా టైటిల్ రేడియేష‌న్ అని అంతా ఫిక్స‌యిపోతున్నారు. మ‌రి దీనిపై చిత్ర‌బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ALSO READ: ఎన్టీఆర్ మౌనం విడాల్సిందే!