ENGLISH

ఎన్టీఆర్ తో ముగ్గురు హీరోయిన్లా..?

04 January 2021-12:00 PM

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. మార్చిలో.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా కీర్తి సురేష్ లేదంటే, ర‌ష్మిక‌ల‌లో ఒక‌రిని ఎంచుకుంటారు. ర‌ష్మిక పేరే దాదాపు ఖాయంలా క‌నిపిస్తోంది. అయితే ర‌ష్మిక‌తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు కూడా ఉంటార్ట‌. అందులో ఒక భామ‌ని బాలీవుడ్ నుంచి ఎంచుకుంటార‌ని తెలుస్తోంది.

 

త్రివిక్ర‌మ్ సినిమాలో రెండో హీరోయిన్ త‌ప్ప‌నిస‌రి.చిన్న పాత్ర‌యినా పేరున్న హీరోయిన్ ని ఎంచుకుంటారు. జ‌ల్సాలో పార్వ‌తీ మెల్ట‌న్‌, అత్తారింటికి దారేదిలో ప్ర‌ణీత‌.. అలా వ‌చ్చిన‌వాళ్లే. ఇప్పుడు కూడా అంతే. ఓ కీల‌క‌మైన పాత్ర‌కు హీరోయిన్‌రేంజ్ ఆర్టిస్టుని తీసుకుంటున్నారు. రెండో నాయిక ఎలాగూ ఉంటుంది. మొత్తానికి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ల‌ని చూడ‌బోతున్నాం. మ‌రి మిగిలిన ఆ ఇద్ద‌రు హీరోయిన్లెవ‌రో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాలి.

ALSO READ: 2024లో సినిమా.. ఇప్పుడెందుకీ హంగామా.?