ENGLISH

'పద్మావతి' ట్రైలర్‌ అద్భుతం, మహాద్భుతం

09 October 2017-16:53 PM

చిత్తోర్‌ఘడ్‌ సంస్థానానికి రాణి పద్మిని జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'పద్మావతి'. దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. రణ్‌వీర్‌సింగ్‌, షాహిద్‌ కపూర్‌ ఇతర ప్రధాన తారాగణం. కాగా ఈ సినిమా ట్రైలర్‌ ఈ రోజు విడుదలైంది. ఈ రోజు మద్యాహ్నం ఒంటి గంట మూడు నిముషాలకు ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ టైంకి ట్రైలర్‌ని విడుదల చేయడంలో ఓ ప్రత్యేకత ఉంది. 1303వ సంవత్సరంలో చిత్తోర్‌ఘడ్‌ సామ్రాజ్యంపై దండెత్తి, రాజా మహారావల్‌ రతన్‌సింగ్‌, రాణీ పద్మావతితో యుద్దం చేసి రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు సుల్తాన్‌ అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ. అందుకే ఒంటి గంట మూడు (13.03 గంటలకు) నిముషాలకు ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. అత్యంత భారీ బడ్జెట్‌ మూవీ ఇది. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఫస్ట్‌లుక్‌తోనే దీపిక 'పద్మావతి' పాత్రలో మెస్మరైజ్‌ చేసేసింది. ఇక ట్రైలర్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ ఆమె అందం. ఇక క్రూరత్వానికి పరాకాష్టగా అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌ అదరగొట్టేశాడు. రావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌ గెటప్‌ ఆకట్టుకుంటోంది. రతన్‌ సింగ్‌, పద్మావతి మధ్య అనుబంధం బాగా చూపించారు ట్రైలర్‌లో. దీపికా అందం, ఖిల్జీగా రణ్‌వీర్‌ సింగ్‌ క్రూరత్వం బాగా హైలైట్‌ అవుతున్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అదరిపోయేలా కట్‌ చేశారు ట్రైలర్‌లో. హైలీ ఎమోషనల్‌ కాన్సెప్ట్‌ ఈ సినిమా. సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన విజువల్‌ వండర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం కూడా సంజయ్‌ లీలా భన్సాలీదే. సినిమా అనుకున్నప్పుడే అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ట్రైలర్‌ విడుదలయ్యాక ఏం కట్‌ చేశార్రా ట్రైలర్‌. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అనేలా రెస్పాన్స్‌ వస్తోంది. డిశంబర్‌ 1న 'పద్మావతి' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: Padmavati Trailer