ENGLISH

పవన్ టీజర్ కి టైమొచ్చింది

29 September 2017-11:20 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం  అయిన ‘అజ్ఞాతవాసి’ గా ప్రేక్షకుల ముందుకి వచ్చే సమయం వచ్చేసినట్టుంది.

ఇప్పటికే విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన ఈ చిత్ర యూనిట్, ఇక టీజర్ అలాగే ట్రైలర్ విషయాల పై ఇంకా స్పందించాల్సి వుంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం, పవన్ చిత్ర టీజర్ దీపావళికి విడుదల చేయనున్నారట అలాగే తరువాత మెల్లమెల్లగా ఒకొక్క పాట విడుదల చేస్తూ చిత్రం విడుదలయ్యే సమయానికి ట్రైలర్ విడుదల చేసేఆలోచనలో టీం ఉన్నారట.

అయితే ఈ మధ్యనే పవన్ పుట్టినరోజు పురస్కరించుకొని విడుదల చేసిన ఒక పాట టీజర్ వైరల్ అవ్వడంతో ఈ చిత్రంపైన ఉన్న అంచనాలు డబల్ అయ్యాయి.

ఇక పవన్ ని అజ్ఞాతవాసిగా చూడాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే..

 

ALSO READ: సమంత, రకుల్‌.. మిథాలీ రాజ్‌గా ఎవరు?