రిపీట్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ సినిమా... గబ్బర్‌సింగ్. ఈ సినిమాతోనే హరీష్ శంకర్ స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అయితే అంతకిక్ ఉన్న సినిమా ఆ తరవాత పవన్ నుంచి గానీ, హరీష్ శంకర్ నుంచి గానీ రాలేదు. ఎట్టకేలకు ఈ కాంబినేషన్ రెడీ అయ్యింది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించనుంది. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
పవన్ ఇటీవలే `పింక్` రీమేక్‌ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. మరోవైపు క్రిష్ సినిమా కూడా క్లాప్ కొట్టుకుంది. ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాకే హరీష్ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే హరీష్ దగ్గర ఓ లైన్ ఉందని, అది పవన్‌కి చెప్పడం, ఆయన ఓకే అనడం జరిగిపోయాయని ఇప్పుడు దాన్ని స్క్రిప్టు రూపంలో మలుస్తున్నారని సమాచారం.
ALSO READ: మెగా కోడలి హెచ్చరిక: వారి పొట్ట కొట్టేస్తుందిగా.!