గతేడాది సివరాఖరిగా 'ప్రతిరోజూ పండగే' సినిమాతో వచ్చి సైలెంట్‌గా సూపర్ హిట్ కొట్టుకెళ్లిపోయాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. 'పది మంది ఉండగా ప్రతిరోజూ పండగే..' అప్పుడేమో అలా అన్న మనోడు, ఇప్పుడేమో 'సోలో బ్రతుకే సో బెటర్..' అంటూ సింగిల్‌గానే జనాల్ని పోగేస్తున్నాడు. సుబ్బు అనే కొత్త దర్శకున్ని పరిచయం చేస్తూ తేజు నటిస్తున్న సినిమా టైటిలే ఈ 'సోలో బ్రతుకే సో బెటర్'.
లేటెస్ట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో తేజు వెనక నుండి కనిపిస్తున్నాడు. చేతిలో 'సోలో లైఫే సో బెటర్' అనే ఓ బుక్ కనిపిస్తోంది. ఆయన ముందు చాలా మంది జనం అరుస్తూ, విజిల్స్ వేస్తూ జేజేలు కొడుతున్నాడు. పిడికిలి బిగించి వారందరిలోనూ ఉత్సాహాన్ని, శక్తిని నింపే వన్ మ్యాన్ ఆర్మీలా కనిపిస్తున్నాడు తేజు. బి.వి.యస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పనే లేదుగా. మే 1. అంటే కార్మికుల దినోత్సవం రోజునన్న మాట. ఈ లోగా వాలెంటైన్స్ వీకెండ్‌లో థీమ్ వీడియోని రిలీజ్ చేయనున్నారట. అదేంటో రిలీజ్ అయితే కానీ తెలీదు మరి. అందాకా ఈ లేటెస్ట్ పోస్టర్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకోవాల్సిందే.
సోలో సోదర సోదరీమణులారా...ఈ valentines weekend మనం అంతా కలిసి జరుపుకుందాం...మన slogan ఒకటే...సోలో బ్రతుకే సో బెటర్ 💪🏼 #SBSBFromMay1st @SVCCofficial @MusicThaman @NabhaNatesh @subbucinema #solobrathukesobetter pic.twitter.com/bDCgGzk1wL
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 1, 2020
ALSO READ: మెగా కోడలి హెచ్చరిక: వారి పొట్ట కొట్టేస్తుందిగా.!