ENGLISH

'మేడమ్‌'గార్ని వదల్లేకపోతోన్న మాటల మాంత్రికుడు.!

01 February 2020-10:34 AM

 'అరవింత సమేత వీర రాఘవ' అంటూ లేడీ ఓరియెంటెడ్‌ టైటిల్‌తో అప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా రూపొందించాడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. హీరోయిన్‌గా పూజా హెగ్దేని తీసుకున్నాడు. ఆమె క్యారెక్టర్‌ని కూడా బలంగా డిజైన్‌ చేశాడు. అది అప్పుడు. ఇక ఇప్పుడు 'అల వైకుంఠపురములో..' అనే సినిమాని అల్లు అర్జున్‌తో తెరకెక్కించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఇక్కడ కూడా సేమ్‌ పూజా హెగ్దేనే. ఆమె క్యారెక్టర్‌కి చాలా వెయిట్‌ ఇచ్చాడు ఈ సినిమాలోనూ. ఓ పెద్ద కార్పొరేట్‌ సంస్థకు బాస్‌గా పూజా హెగ్దే క్యారెక్టర్‌ డిజైన్‌ చేశాడు.

 

ఇక తాజాగా త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌తో కమిట్మెంట్‌కి రెడీ అయ్యాడని తెలుస్తోంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఎన్టీఆర్‌ నటించబోయే చిత్రం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తోనే అనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ సినిమాలో కూడా పూజా హెగ్దేనే తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్‌ ఉన్నట్లు తాజా సమాచారం. ఆ మాటకొస్తే, ప్రస్తుతం తాను ఏ హీరోతో సినిమా చేసినా హీరోయిన్‌ మాత్రం పూజా హెగ్దేనే అన్నట్లు డిసైడ్‌ అయిపోయాడట. అంతలా మేడమ్‌ ఈ మేధావి డైరెక్టర్‌ని ఇంప్రెస్‌ చేసేసింది. ప్రస్తుతం పూజా హెగ్దే చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. ప్రబాస్‌తో 'జాన్‌' చిత్రంలోనూ, అఖిల్‌తో బొమ్మరిల్లు భాస్కర్‌ చిత్రంలోనూ పూజా హెగ్దే నటిస్తోంది.

ALSO READ: మెగా కోడలి హెచ్చరిక: వారి పొట్ట కొట్టేస్తుందిగా.!