ENGLISH

మెగా కోడలి హెచ్చరిక: వారి పొట్ట కొట్టేస్తుందిగా.!

01 February 2020-10:28 AM

కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా చిలక జోస్యంతో చాలా మంది పొట్ట పోసుకుంటున్నారు. అయితే, అలాంటి వారి ఉపాధికి గండి పడ్డట్లే. తాజాగా మెగా కోడలు ఉపాసన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. రామచిలుకను బంధించి ఉంచితే, 5000 రూపాయలు జరిమానా, ఆరు నెలలు జైలు శిక్ష పడుతుందని ఆ పోస్ట్‌ సారాంశం. 'రామచిలక ఎగరడానికే పుట్టింది. మీరు జాతకాలు చెప్పించుకోవడానికో, లేక ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీలవ్వడానికో కాదు, రామచిలను పంజరంలో బంధించి ఉంచితే వెంటనే వదిలేయండి. అలాంటి సమాచారం మీ దగ్గర ఉంటే, వెంటనే మాకు తెలియజేయండి.. ' అంటూ గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చింది ఉపాసన.

 

రామచిలుక మన రాష్ట్ర పక్షి అని తెలిసిందే. ఇలాంటి వన్య ప్రాణుల సంరక్షణార్ధం మెగా కోడలు ఉపాసన నడుం కట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వన్య ప్రాణిని నమ్ముకుని పొట్ట పోసుకుంటున్న వారి సంగతి ఏంటీ.? లిటరల్‌గా వారి పొట్ట కొట్టినట్లేగా. పార్కులు వంటి బోలెడన్ని బహిరంగ ప్రదేశాల్లో చిలక జోస్యం చెప్పేవాళ్లు చాలా మంది తమకున్న వాక్‌ చాతుర్యంతో, రామచిలును తమ ఆదాయ వనరుగా ఎంచుకుని పొట్ట పోసుకుంటున్నారు. లేటెస్ట్‌గా మెగా కోడలి పోస్ట్‌తో అలాంటి వారందరూ రోడ్డున పడతారంటూ కొందరు నెటిజన్లు వాపోతున్నారు.

ALSO READ: లిప్‌లాక్‌ హీరోనే కానీ, ఆ అబ్బాయి చాలా మంచోడు.!