చైల్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న హిరోషిణి ఈ మధ్య లిప్‌లాక్ విషయమై పెద్ద సీన్ చేసిన సంగతి తెలిసిదే. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోతో లిప్‌లాక్ సీన్ ఉందట. అయితే, ఆ సీన్‌ని ప్రొఫిషనల్‌గా కాకుండా హీరో కొంచెం ఎక్కువ పర్సనల్‌గా తీసుకున్నాడనీ, తన పట్ల ఆ హీరో ప్రవర్తించిన తీరును తప్పు పడుతూ హిరోషిణి వార్తల్లో నిలిచింది.
ఇదిలా ఉంటే, మన టాలీవుడ్‌కి సంబంధించి లిప్‌లాక్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు మన రౌడీ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండతో సినిమా అంటే, హీరోయిన్‌కి ఖచ్చితంగా లిప్‌లాక్ ఉండాల్సిందే అనే ముద్ర పడిపోయింది. అయితే, విజయ్‌లో ఆ యాంగిల్ అస్సలు కనిపించలేదంటోంది ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్. విజయ్ దేవరకొండతో కలిసి ఐశ్వర్యా రాజేష్ 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే, విజయ్ - ఐశ్వర్యల మధ్య లిప్‌లాక్ సీన్స్ లేవు కానీ, మరో హీరోయిన్ రాశీఖన్నాతో డీప్ లిప్‌లాక్ ఉండనే ఉంది. సినిమా కోసం సిట్యువేషన్ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ సీన్ చేయడంలో తప్పేముంది.? అంటూ విజయ్‌నీ, లిప్‌లాక్స్‌నీ కూడా సమర్ధిస్తూ ఈ ముద్దుగుమ్మ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. అంటే తనకు ఆ ఛాన్స్ రాలేదు. కానీ, ఒకవేళ వస్తే, లిప్‌లాక్‌కి తాను సిద్ధమే అని ఇన్‌డైరెక్ట్‌గా ఈ తెలుగమ్మాయ్ హింట్ ఇచ్చేసిందన్న మాట. లవర్స్‌డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ALSO READ: రష్మికా.. వాట్ ఏ బ్యూటీ.!