ENGLISH

పవన్ టార్గెట్ 175 అట?!

02 October 2017-17:13 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్స్ లో రాజకీయంగా పాల్గొనేందుకు సిద్ధం అంటూ ప్రకటించాక ఇప్పుడు ఇక తన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నది అన్న విషయంపై స్పష్టత వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

జనసేన పార్టీ సోషల్ మీడియా అకౌంట్స్ నుండి జనసేన పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 175 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ ప్రకటన అధికారికంగా పవన్ కళ్యాణ్ నుండి రానప్పటికీ ఇది పార్టీ అంతర్గత చర్చల సారంశంగనే ఈ సంఖ్య బయటకి వచ్చినట్టు తెలుస్తున్నది.

ఇదిలావుండగా పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య మాట్లాడుతూ- తనకి ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలని ఎంతవరకు అమలు చేసింది అన్న విషయంలో స్పష్టత ఉన్నది అని వ్యాఖ్యానించిన నేపధ్యంలో ఈ 175 సంఖ్య ఆసక్తి రేపుతున్నది.

ఏదైతేనేమి.. ఆయన అభిమానులు కోరుకున్న విధంగా ఆయన ఎన్నికల రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది.

 

ALSO READ: అమెరికాలో మహానుభావుడు కలెక్షన్స్!