ENGLISH

పవన్‌ రీ ఎంట్రీ మామూలుగా లేదు!

30 January 2020-09:30 AM

'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు దాదాపు గుడ్‌ బై చెప్పేశారు. రాజకీయాల్లో బిజీ అయిపోయారు. కానీ, సినిమాల్లో పవన్‌ లేని లోటు అలాగే ఉండిపోయింది. అందుకే ఏదో ఒక రకంగా పవన్‌ని సినిమాల్లోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సివరాఖరికి దిల్‌రాజు విక్రమార్క పట్టు పట్టి పవన్‌ని తిరిగి సినిమాల్లోకి తీసుకొచ్చేశారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు బ్యానర్‌లో 'పింక్‌' రీమేక్‌ జరుగుతోంది. ఈ సినిమా కోసం పవన్‌ నుండి కేవలం 21 రోజులు మాత్రమే డేట్స్‌ తీసుకుని సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు దిల్‌రాజు.

 

ఓ వైపు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే పవన్‌ కళ్యాణ్‌ మరో సినిమానీ సైలెంట్‌గా లైన్‌లో పెట్టేశాడు. అదే క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా. పీరియాడికల్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి ఫోటోలూ, లీకులూ లేవు కానీ, సినిమా ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో స్టార్ట్‌ అయిపోయిందనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా జరిగిపోనుందట. అయితే, ఈ సినిమా కోసం అవుట్‌ డోర్‌కి వెళ్లే పని పెట్టుకోవడం లేదట పవన్‌ అండ్‌ టీమ్‌. సినిమాకి సంబంధించిన అన్ని సెట్స్‌నీ ఇండోర్‌లోనే ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఎప్పటి నుండో పవన్‌తో సినిమా తెరకెక్కించాలన్న క్రిష్‌ కోరిక ఇన్నాళ్లకు ఇలా సైలెంట్‌గా నెరవేరబోతోందన్న మాట. ఏది ఏమైతేనేం, పవన్‌ రీ ఎంట్రీ తప్పలేదుగా.

ALSO READ: సక్సెస్‌కి సమంత సూచనలు!