ENGLISH

రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పవన్ వాఖ్యలు

15 March 2018-12:30 PM

జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న తన పార్టీ నాల్గవ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్ని ఎన్నికల సమయంలో ప్రజలకి డబ్బు పంచడానికి ముందుంటారు అని, అలాంటివారి దగ్గర డబ్బు తీసుకుని జనసేనకి ఓటు వేయమని పిలుపునిచ్చాడు.

అయితే అలా డబ్బు తీసుకుని ఓటు వేయడానికి మీరు పశ్చాతాపం పడవలసిన అవసరం లేదు అని, ఎందుకంటే వారు ఆ డబ్బు ప్రజల నుండి అలాగే అడ్డదారుల్లో సంపాదించిన సొమ్ము అని తేల్చిచెప్పారు. ఎవరైనా ఇలా డబ్బు తీసుకోవడం ధర్మం కాదు అని అనుకోవద్దు. కావాలంటే మీ అందరి తరపున అందరి దేవుళ్ళతో నేను మాట్లాడతాను అని చమత్కరించాడు.

ఈ మాటలకి సభ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. ఇక తన పార్టీ ఎజెండాని ఆగష్టు 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. అలాగే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కూడా దుయ్యబట్టాడు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ నిన్న తన ప్రసంగంలో ఘాటు విమర్శలు చేశాడు.

ALSO READ: అఖిల్‌పై వస్తున్న ఆ రూమర్స్‌ సంగతేంటి చెప్మా!