ENGLISH

రంగస్థలం C/o వైజాగ్

15 March 2018-12:24 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్రానికి సంబందించిన ప్రచార కార్యక్రమాల వివరాలని రంగస్థలం యూనిట్ కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో వెల్లడించింది. 

ఆ వివారాలు ఇలా ఉన్నాయి, ఈ మార్చ్ 18న రంగస్థలం ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ లో చేయనున్నారట. ఇక ఇప్పటికే రంగస్థలం జ్యుక్ బాక్స్ విడుదల చేయడం ఆ పాటలకి మంచి రెస్పాన్స్ వస్తున్నది. సుకుమార్-దేవిశ్రీప్రసాద్ కలయికలో వచ్చే హిట్ మ్యూజిక్ ఈ చిత్రంతో కొనసాగుతున్నది.దేవి స్వరాలకి చంద్రబోస్ గారు అందించిన సాహిత్యంకి చాలా చక్కగా కుదిరింది అనే చెప్పాలి. 

ఇక మార్చ్ 30న ఈ చిత్రం విడుదలవ్వనుండడంతో రోజుకొక కొత్తరకమైన ప్రచారంతో ప్రజల్లోకి ఈ చిత్రాన్ని తీసుకెళ్ళనున్నాము అని దర్శక-నిర్మాతలు చెప్పారు.

అయితే ఇప్పటికే ఈ సినిమాకి సినీ అభిమానులతో పాటుగా సామాన్య ప్రజానీకంలో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్నది అన్నది నిర్వివాదాంశం.  

 

ALSO READ: అఖిల్‌పై వస్తున్న ఆ రూమర్స్‌ సంగతేంటి చెప్మా!