ENGLISH

'రంగస్థలమ్‌' మెగా సర్‌ప్రైజ్‌?

27 September 2017-18:04 PM

రామ్‌చరణ్‌ హీరోగా 'రంగస్థలమ్‌' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 1985 కాలం నాటి లవ్‌స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి పెద్దగా అప్‌డేట్స్‌ లేకపోయినప్పటికీ, తాజా సమాచారమ్‌ ప్రకారం 'రంగస్థలమ్‌' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ వేడుకని హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని చిత్ర యూనిట్‌ యోచిస్తోందట. ఈ వేడుకకి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చీఫ్‌ గెస్ట్‌గా రానున్నారట. ఆయన చేతుల మీదే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయనున్నారనీ గాసిప్‌ వినిపిస్తోంది. ఒకవేళ ఈ గాసిప్‌ నిజమైతే ఇంకేముంది మెగా అభిమానులకు మెగా సందడే. ఇంతవరకూ పవన్‌ కళ్యాణ్‌ మెగా ఫంక్షన్స్‌కి హాజరు కావడం చాలా అరుదు. ఇందుకు కారణం ఫ్యామిలీతో పవన్‌ కళ్యాణ్‌కి పొత్తులు సరిగా లేవనీ భిన్న వాదనలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని మెగా ఫ్యామిలీ కొట్టి పారేస్తూ ఉంటారు. అయినా కానీ నిప్పు రాజేసే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. ఒకవేళ వినిపిస్తోన్న గాసిప్‌ నిజమై, అబ్బాయి సినిమాకి బాబాయ్‌ వస్తే ఇంకేముంది. అన్న వాళ్ల నోళ్లు అన్నీ మూత పడినట్లే. సుకుమార్‌ దర్శకత్వంలో 'రంగస్థలమ్‌' తెరకెక్కుతోంది. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌చరణ్‌ గెటప్‌, స్టోరీ కాన్సెప్ట్‌ అంతా సరికొత్తగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం ఎక్కువగా షూటింగ్‌ జరుపుకుంది.

 

ALSO READ: స్పైడ‌ర్‌ రివ్యూ & రేటింగ్స్