ENGLISH

పవన్ కళ్యాణ్ కంటికి శస్త్రచికిత్స

21 June 2018-14:54 PM

జనసేనాని పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తన ఎడమ కంటిలో వచ్చిన ఇన్ఫెక్షన్ తో భాదపడుతున్న సంగతి విదితమే. దీనివల్లే ఆయన గత కొన్నిరోజులుగా కంటికి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఇక దీనికి సంబందించిన తాజా సమాచారం ఒకటి బయటికొచ్చింది.

 

అదేంటంటే- రంజాన్ సందర్భంగా తన ప్రజా పోరాట యాత్రకి విరామం ఇచ్చిన సమయంలో హైదరాబాద్ నందు ఉన్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇన్ఫెక్షన్ ని పరిశీలించిన తరువాత కంటికి చిన్నపాటి శస్త్రచికిత్స చేయాల్సిందిగా సూచించారట.

దీనితో త్వరలోనే ఈ శస్త్రచికిత్స జరగనున్నట్టుగా సమాచారం. ఇక రాజకీయాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో మరింత విస్తృతంగా తన ప్రజా పోరాట యాత్ర కొనసాగించేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించిగా త్వరలోనే మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళనున్నట్టుగా స్పష్టం చేశారు.

 

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన చెందుతున్న వారికి ఈ వార్త కొంత ఉపశమనం కలిగించేదే అని అనుకోవచ్చు.     

 

ALSO READ: సుధీర్ తో పెళ్ళి పైన క్లారిటీ ఇచ్చిన రష్మి