ENGLISH

విజయ్.. రష్మిక ల మధ్య ముదిరిన మాటల యుద్ధం..!

21 June 2018-11:43 AM

విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సినిమా టైటిల్‌ 'గీత గోవిందం'. 

ఈ సంగతిటుంచితే, తాజాగా ఈ ఇద్దరి మధ్యా సోషల్‌ మీడియాలో ఓ క్రేజీ డిస్కషన్‌ జరిగింది. ఇటీవల ఫిల్మ్‌ఫేర్‌లో విజయ్‌ దేవరకొండకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తన కో స్టార్‌ విజయ్‌ దేవరకొండకి సోషల్‌ మీడియాలో చిలిపిగా కాంప్లిమెంట్‌ ఇచ్చింది రష్మికా. ఏమనో తెలుసా? ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు వచ్చిందట కదా.. కంగ్రాట్యులేషన్స్‌ గోవింద్‌ అని. అట్నుంచి విజయ్‌ దేవరకొండ కూడా అంతే చిలిపిగా సమాధానమిచ్చాడు. 

అవార్డులో ఏముంది మేడమ్‌. మీలాంటి వాళ్లు నన్ను ప్రేమించడం చాలు గీతా మేడమ్‌..' అని విజయ్‌దేవరకొండ బదులిచ్చాడు. నాలాంటి వాళ్లా..? వాళ్లు ఏంటీ? ఆ ప్లూరల్‌ ఏంటీ..? తెలుసులే నీ గురించి.. ఒక్కరు సరిపోరు ఎవర్నీ వదలవుగా.. అంది రష్మికా. గీతా మేడమ్‌ మీతో టైం గడపడం నాకు నిజమైన అవార్డ్‌ మేడమ్‌. ఇవి వస్తుంటాయ్‌.. పోతుంటాయ్‌..అని విజయ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఇగో గోవిందం ఈ ఓవరాక్షనే తగ్గించుకోమనేది. అసలు నీక్కాదు, ప్రబాస్‌కో, తారక్‌కో ఇస్తే మాకు ఈ గొడవ పోయేది..అని రష్మికా కొంచెం ఫైరింగ్‌ రిప్లై ఇచ్చింది..  

ఇలా సాగింది ఈ ఇద్దరి మధ్యా ట్వీట్ల ప్రసహనం. సినిమా పబ్లిసిటీ కోసం ఇదొక వెరైటీ చిలిపి యుద్ధం అనుకోవాలి. సోషల్‌ మీడియాలో మాత్రం ఈ డిస్కషన్‌కి నెటిజన్లు ఇద్దరినీ తిడుతూ కామెంట్లు పోస్ట్‌ చేశారు.

ఇకపోతే 'గీత గోవిందం' సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఇంట్రెస్టింగ్‌ ప్రీ లుక్‌ రిలీజ్‌ చేశారు. ఒకరు ఇంప్రెస్‌ చేయడానికి, ఒకరు అవైడ్‌ చేయడానికీ ట్రై చేస్తున్నట్లుంది ఆ ప్రీలుక్‌లో. 23న ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయనున్నారు. అదీ సంగతి.

 

ALSO READ: సుధీర్ తో పెళ్ళి పైన క్లారిటీ ఇచ్చిన రష్మి