ENGLISH

నిర్మాత‌కు ప‌వ‌న్ క్లాస్‌.. అందుకే సారీ!

19 February 2022-16:36 PM

ఇటీవ‌ల డీజే టిల్లు స‌క్సెస్ మీట్ లో నిర్మాత సూర్య దేవ‌ర నాగ వంశీ నోరు జారిన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల్ని `వాడు.. వాడు` అంటూ సంబోధించ‌డం చాలా మందికి న‌చ్చ‌లేదు. దాంతో సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. హిట్టు కొట్టిన ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ లో ప్రేక్ష‌కుల్ని చుల‌క‌న చేస్తావా? అంటూ చాలామంది దుమ్మెత్తిపోశారు. దాంతో నిర్మాత నాగ‌వంశీ దిగి వ‌చ్చి `సారీ` చెప్పాడు. త‌న ఉద్దేశ్యం ప్రేక్ష‌కుల్నిచిన్న చూపు చూడ‌డం కాద‌ని, వాళ్ల‌ని సోద‌రులుగా భావిస్తాన‌ని, అందుకే అలా అన్నాన‌ని, ఎవ‌రైనా త‌ప్పుగా భావిస్తే క్ష‌మించాల‌ని, ప్రేక్ష‌కులే త‌మ సంస్థ బ‌లం అని ట్వీట్ చేశాడు. దాంతో స‌మ‌స్య తొల‌గిపోయింది.

 

అయితే... నాగ వంశీ సారీ చెప్ప‌డం వెనుక‌... ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నాడ‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. మీడియాలో నాగ వంశీపై వ‌స్తున్న ట్రోలింగ్ ని ప‌వ‌న్ గ‌మ‌నించార‌ని, `సారీ.. చెప్పేయ్‌` అని స‌ల‌హా ఇచ్చార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే త్వ‌ర‌లో రాబోతున్న `భీమ్లా నాయ‌క్‌`కి ... నాగ‌వంశీనే నిర్మాత‌. ఆ సినిమాపై.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌కూడ‌ద‌న్న‌ది ప‌వ‌న్ అభిప్రాయం. అందుకే నాగ వంశీ కూడా న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల్లో దిగిపోయి, సారీ చెప్పాడు. దాంతో.. మేట‌ర్ క్లియ‌ర్ అయ్యింది.

ALSO READ: భీమ్లాకు రానా హ్యాండిస్తాడా?