ENGLISH

భీమ్లాకు రానా హ్యాండిస్తాడా?

19 February 2022-13:00 PM

ఈనెల 25న భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. నేడో, రేపో... ట్రైల‌ర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి వేదిక కూడా సెట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ షోలూ రెడీ అవుతున్నాయి. అయితే... ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో రానా క‌నిపిస్తాడా? లేదా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. భీమ్లా లో రానా కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఇది మ‌ల్టీస్టార‌ర్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉండ‌డంతో.. దీన్ని సోలో హీరో సినిమాగానే చూస్తున్నారంతా. ఇప్ప‌టి వ‌ర‌కూ రానాకి అంత హైప్ ఇవ్వ‌లేదు చిత్ర‌బృందం. దీన్ని ప‌వ‌న్ సినిమాగానే ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది. క‌థ‌లో కూడా రానా పాత్ర నిడివి, ప్రాధాన్యం కొంత త‌గ్గించారన్న వార్త‌లొచ్చాయి.

 

దీనిపై రానా అసంతృప్తిగా ఉన్నాడ‌ని కూడా అన్నారు. రానా నిరాశ‌కు గుర‌య్యాడ‌ని, ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో తాను క‌నిపించే అవ‌కాశం లేద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. మ‌హా అయితే.. త‌ను.. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో మాత్ర‌మే క‌నిపిస్తాడ‌ని, మీడియా ముందుకు రావ‌డానికి, పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని చెప్పుకుంటున్నారు. ఇటీవ‌ల రానా కూడా ఫైన‌ల్ కాపీ చూశాడ‌ని, ప‌వ‌న్ పాత్ర‌కు ప్రాధాన్యం ఇచ్చి, త‌న పాత్ర నిడివి త‌గ్గించార‌న్న అసంతృప్తి రానాలో క‌నిపించింద‌ని, అందుకే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ని తెలుస్తోంది.

ALSO READ: ఖిలాడీకి మేలు చేసిన క‌ల‌క్ష‌న్ కింగ్‌!