ENGLISH

మోడీజీ... న‌న్ను ర‌క్షించండి: పాయల్ ఘోష్

20 September 2020-10:00 AM

ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌తో ఇండ్ర‌స్ట్రీని వ‌ణికిస్తోంది పాయల్ ఘోష్. తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్‌ కశ్యప్‌ తనపై లైంగిక దాడి చేశారంటూ మ‌రో బాంబు పేల్చింది. త‌న‌ని ఇంటికి పిలిచి, అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, త‌న దుస్తులు విప్ప‌బోయాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, త‌న‌ని ర‌క్షించాలంటూ ప్రధాని మోదీని కోరింది పాయ‌ల్‌. శనివారం ఆమె ట్విట్టర్‌లో..‘అనురాగ్‌ కశ్యప్‌ నాపై చాలా తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు.

 

నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి’ అంటూ పేర్కొంది. ఈ ట్వీట్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌ధాని కార్యాల‌యం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు గానీ, ఈ విష‌యంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.

 

ఆధారాల‌తో వ‌స్తే, అనురాగ్ పై చ‌ర్యలు తీసుకుంటామ‌ని పాయ‌ల్ కి భ‌రోసా ఇచ్చింది. మొత్తానికి పాయ‌ల్ వ్యాఖ్య‌లు బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్‌ని మ‌రో కోణంలో చూపించిన‌ట్టైంది. అవ‌కాశాల్ని ఎర‌చూపి, అమ్మాయిల్ని ఎలా వాడుకుంటారో చెప్ప‌డానికి ఇదో నిద‌ర్శ‌నంగా నిలిచింది.

ALSO READ: ‘జీరో రెమ్యునరేషన్‌’ అంటున్న మెగాస్టార్‌.!