ENGLISH

అదుర్స్ సినిమా చూస్తుండగా బ్రెయిన్ సర్జరీ

18 September 2024-12:54 PM

తాము అభిమానించే హీరోలపై ప్రేమని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తూ ఉంటారు. తమకిష్టమైన హీరో సినిమా చూస్తే బాధని , నొప్పిని మర్చిపోతారు. ఇలాంటి వారిలో పవన్ ఫాన్స్ తరచుగా దర్శనమిస్తూ ఉంటారు. గత ఏడాది నెల్లూరులో ఒడిశాకి చెందిన ఒక భవన కార్మికుడు బిల్డింగ్ పై నుంచి పడి తల రెండుగా విడిపోయింది. అతనిని హాస్పటల్ కి తీసుకు వెళ్తే సర్జరీ చేయాలనీ చెప్పారు డాక్టర్స్. అతనికి ఎన్ని సార్లు ఎనస్తీషియా ఇచ్చినా పని చేయలేదు. చివరికి అతను పవన్ కళ్యాణ్ సినిమా పెట్టండి చూస్తా అప్పుడు నాకు నొప్పి తెలియదు అని పేర్కొన్నాడు.  చివరికి అతనికి పవన్ సినిమా పెట్టి ఎనస్తీషియా లేకుండా ఆపరేషన్ చేశారు. ఇపుడు కూడా అలాంటి ఘటనే కాకినాడలో జరిగింది. 


కానీ ఇక్కడ పరిస్థితి వేరు. పేషేంట్ మెలకువగా ఉండగా చేయాల్సిన ఆపరేషన్ కావటంతో ఆమె అదుర్స్ సినిమా చూస్తుండగా బ్రెయిన్ సర్జరీ చేశారు. కాకినాడ సర్వజన ఆసుపత్రిలో జరిగింది ఈ సంఘటన. 55 ఏళ్ల ఒక మహిళకి 15 రోజులగా కుడి చెయ్య కుడికాలు బలహీనపడి కాకినాడ జిజి హెచ్ వైద్యల్ని సంప్రదించింది. ఈ మేరకు టెస్ట్ లు చేసిన వైద్యులు ఎమ్మారై  స్కాన్ కూడా చేసారు. అందులో ఆమెకి ఎడమవైపు మెదడులో ఒక కణితి ఉందని న్యూరోసర్జన్ టీమ్ గుర్తిచింది. అది క్యాన్సర్ కణితి అని వెంటనే దాన్ని తీసేయాలని ఆమెకి వివరించి, ఆ ట్రీట్ మెంట్ కూడా ఎలా చేయాలో ఆమెకి చెప్పారు. అవేక్ క్రేనియాటమీ అనే మోడ్రన్ పద్ధతిలో సర్జరీ చేయటానికి డిసైడ్ అయ్యి ఆమెని ఒప్పించారు. 


దీని ప్రకారం పేషేంట్ కి ఎనస్తీషియా ఇవ్వరు, దీనివలన ఆఫ్టర్ సర్జరీ పేషేంట్ కి ఎలాంటి  ఇబ్బందులు తలెత్తవు. ఆమె కూడా దీనికి ఒప్పుకోవటంతో సెప్టెంబర్ 17 జిజిహెచ్ న్యూరో సర్జన్ టీమ్ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు. ఆపరేషన్ మొదలు పెట్టిన దగ్గరనుంచి పూర్తి మెలకువతో ఆమె అదుర్స్ సినిమా చూస్తూనే ఉన్నారు. పేషేంట్ చేత్తో పట్టుకుని ట్యాబ్ లో అదుర్స్ చూస్తుండగా, డాక్టర్స్ సర్జరీ పూర్తి చేయటం గమనార్హం.