ENGLISH

అలా చెయ్యనంటే ఎలాగమ్మా బుట్టబొమ్మా?

14 October 2020-16:30 PM

మామూలుగా ఏ హీరోయిన్‌ అయినా కమర్షియల్‌ హిట్స్‌ కొట్టిన తర్వాత, నటిగా ప్రూవ్‌ చేసుకునే క్రమంలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ ఫిలింస్‌ గురించి ఆలోచిస్తారు. కానీ, బుట్టబొమ్మ పూజా హెగ్దే మాత్రం తనకు అలాంటి ఆలోచనే లేదని తెగేసి చెప్పేస్తోంది. ‘నా ఫేస్‌కి సీరియస్‌గా తెరపై కనిపిస్తే, ఆ క్యారెక్టర్‌ అస్సలు సూటవదు..’ అంటోంది పూజా హెగ్దే. ‘నేనెప్పుడూ ఫన్‌తో కూడిన పాత్రల్నే ఇష్టపడతాను. నేను చేసే సినిమాల్లో అప్పుడప్పుడూ సీరియస్‌ టోన్‌ కనిపిస్తే ఓకే.. కానీ, సినిమా అంతా సీరియస్‌గా కన్పించాల్సి వస్తే నాకిష్టం వుండదు.. నన్ను అభిమానించేవారూ ఇష్టపడరు..’ అని కుండబద్దలుగొట్టేసింది పూజా హెగ్దే.

 

బాబోయ్‌, పూజా ఏంటి ఇలా ఆలోచిస్తోంది.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్దే నెంబర్‌ వన్‌ హీరోయిన్‌. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘శాకుంతలం’లో ఆమె నటించబోతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయమై పూజా హెగ్దే పెదవి విప్పలేదు. ఇదిలా వుంటే, ప్రభాస్‌తో పూజా హెగ్దే చేస్తోన్న ‘రాదేశ్యావ్‌ు’ షూటింగ్‌ పునఃప్రారంభమవుతోంది కరోనా లాక్‌డౌన్‌ తర్వాత. అఖిల్‌ సరసన పూజా హెగ్దే నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ విడుదలకు సిద్ధమవుతోంది.

ALSO READ: ‘ఆచార్య’కి ‘సూపర్ స్టార్స్‌’ సాయంలో నిజమెంత!