ENGLISH

అటు పూజా.. ఇటు కియారా.. మ‌ధ్య‌లో ఎన్టీఆర్‌

19 July 2021-12:20 PM

ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత ఎన్టీఆర్ చేయ‌బోయే సినిమా ఇదే. `ఆచార్య‌` ముగిసిన వెంట‌నే ఈ సినిమాని కొర‌టాల ప‌ట్టాలెక్కిస్తారు. ఈలోగా క‌థానాయిక‌, ఇత‌ర సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది. ఇందులో క‌థానాయిక‌గా కియారా అద్వాణీని ఎంచుకున్న‌ట్టు ఇది వ‌ర‌కు వార్త‌లొచ్చాయి. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `భ‌ర‌త్ అను నేను`లో కియారా క‌థానాయిక‌.

 

అయితే ఇప్పుడు పూజా హెగ్డే పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. `ఆచార్య‌`లో పూజా ఓ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా ప‌నిత‌నం మెచ్చిన కొర‌టాల‌.. ఆమెను క‌థానాయిక‌గా ఎంచుకున్నాడ‌ని స‌మాచారం. కాక‌పోతే... కైరా కూడా ఉంటుందా? కైరా స్థానంలో పూజా వ‌చ్చిందా? అనే విష‌యాలు మాత్రం స‌స్పెన్స్‌. ఒక‌టి మాత్రం స్ప‌ష్టం.. వీరిద్ద‌రిలో ఒక క‌థానాయిక మాత్రం క‌చ్చితంగా ఎన్టీఆర్ తో జోడీ క‌డుతుంది. ఇద్ద‌రూ న‌టించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. మ‌రి ఈ స‌స్పెన్స్‌కి తెర ప‌డేదెప్పుడో?

ALSO READ: రోజాకి మంత్రి ప‌ద‌వి వ‌రించ‌నుందా?