ENGLISH

రోజాకి మంత్రి ప‌ద‌వి వ‌రించ‌నుందా?

19 July 2021-11:00 AM

ఏపీ రాజ‌కీయాల్లో రోజా ఇప్పుడో ఫైర్ బ్రాండ్. వైకాపా త‌ర‌పున పోటీ చేసి.. ఘ‌న విజ‌యం సాధించింది. అయితే.. అప్ప‌ట్లో ఆమెకు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అంతా ఆశించారు. కానీ.. కేవ‌లం నామినేటెడ్ పోస్ట్ తో స‌రిపెట్టుకోవాల్సివ‌చ్చింది. అప్ప‌టి నుంచీ.. రోజా చాలా అసంతృప్తితో ఉన్నార‌ని స‌మాచారం. అయితే త్వ‌ర‌లోనే ఏపీ కేబినేట్ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌బోతోంద‌ని, రోజాకి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఏపీలో వైకాపా నేత‌ల‌కు కొత్త‌గా నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కాయి.

 

రోజా చేతిలో ఉన్న నామినేటెడ్ పోస్ట్ ఊడిపోయింది. త్వ‌ర‌లో ఆమెకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌బోతోంద‌ని, అందుకే నామినేటెడ్ పోస్ట్ నుంచి తొల‌గించార‌ని చెబుతున్నారు. అయితే.. ఇంకొంత‌మంది మాత్రం రోజా మంత్రి కావ‌డం క‌ల అని.. నామినేటెడ్ పోస్టు నుంచే తొల‌గించేస్తే.. ఇక మంత్రి ప‌ద‌వి ఎక్క‌డి నుంచి వ‌స్తుంద‌ని ఎద్దేవా చేస్తున్నారు. త‌న‌ని నామినేటెడ్ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం ప‌ట్ల రోజా గుర్రుగానే ఉన్నా, త్వ‌ర‌లోనే మంత్రి ప‌ద‌వి ద‌క్క‌బోతోంద‌న్న ఆశాభావంతో ఉంది. అది రాక‌పోతే మాత్రం.. రోజా ప‌రిస్థితి ఏమిటో?

ALSO READ: త‌రుణ్ భాస్క‌ర్ తో సినిమా ఉందా, లేదా?