మనిషిని పోలిన మనిషులు ఈ భూమ్మీద ఏడుగురుంటారట అనేది ఎప్పటినుండో పెద్దలు చెబుతున్న మాట. అయితే వాళ్లు ఎక్కడ ఉంటారో తెలీదు. హీరోల్లా మేకప్ వేసుకుని అచ్చం వారిలానే అనుకరించడం ప్రస్తుతం కొంత మంది ఆర్టిస్టులు చేస్తున్న వైనం. ఇవన్నీ కాదు అచ్చం ఓ హీరోని పోలిన మరో వ్యక్తి ఉన్నాడంటే నమ్ముతారా? అది కూడా ఇక్కడే. ఆయన ఎవరో కాదు, కిరణ్ రాజ్. ఈ పేరు మనకి పెద్దగా తెలీదు. కానీ మనిషి మాత్రం తెలుసు. ఈయన రూపం అచ్చం హీరో ప్రబాస్‌లానే ఉంటుంది. అందుకే ఈయన్ని 'బాహుబలి' సినిమా కోసం డూప్‌లా వాడుకున్నారట. 'బాహుబలి' హీరో ప్రబాస్ అని మనకు తెలిసు. అయితే ఇది తెర పైన. తెర వెనుక కూడా అచ్చం ప్రబాస్ లాంటి హీరోనే ఉన్నాడు. ప్రబాస్‌కి డూప్‌గా చేశాడు ఈ హీరో. పేరు కిరణ్ రాజ్. ముఖ్యంగా 'బాహుబలి'లో యుద్ధ సన్నివేశాల్లో ప్రబాస్ కన్నా కిరణ్ రాజ్ చేసిన షాట్సే ఎక్కువట. ఈ విషయం బాహుబలి డైరెక్టర్ రాజమౌళి చెబితేనే తెలిసింది. కానీ ఈ విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనా అచ్చం ప్రబాస్ లాంటి వ్యక్తి మరొకరు ఉన్నారన్న సంగతి బావుంది. ఇప్పుడు ఈ వ్యక్తి డైరెక్ట్‌గా హీరోగా మారుతున్నాడు. 'కరాళి' టైటిల్‌తో కొత్త దర్శకుడు కిరణ్ దర్శకత్వంలో కిరణ్ రాజ్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా 'బాహుబలి' సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. అంటే ప్రబాస్ లాంటి వ్యక్తిని డైరెక్టుగా హీరోగా స్క్రీన్‌పై త్వరలోనే చూడబోతున్నామన్న మాట.
ALSO READ: బాలయ్య అన్ని లక్షలు పెట్టిండా