ENGLISH

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి మ‌ళ్లీ నిరాశే

17 October 2020-16:30 PM

`రాధే శ్యామ్‌` మొద‌లై... ఏడాది దాటేసింది. ఈపాటికి సినిమా వ‌చ్చేయాలి కూడా. క‌ర్ణుడి చావుకి వంద కార‌ణాల‌న్న‌ట్టు.... ఎన్నో కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. ఈ సినిమా అప్ డేట్ గురించి ఎదురు చూస్తూ, ఎదురు చూస్తూ ప్ర‌భాస్ అభిమానుల క‌ళ్లు కాయ‌లైపోయాయి. ఎట్ట‌కేల‌కు ఈమ‌ధ్యే టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ టీజ‌ర్ కూడా వ‌ద‌ల్లేదు.

 

ఈనెల 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా `రాధే శ్యామ్‌` టీజ‌ర్ వ‌స్తుంద‌ని అభిమానులు ఆశించారు. ఈసారీ వాళ్ల‌కు నిరాశే ఎదుర‌వుతుంది. ఈ పుట్టిన రోజున టీజ‌ర్ రావ‌డం లేదు. ఆ స్థానంలో మోష‌న్ పోస్ట‌ర్ మాత్ర‌మే విడుద‌ల చేస్తున్నారు. ఇందుకు సంబంధించి న అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. సినిమా మొద‌లైన ఇంత కాలానికి మోష‌న్ పోస్ట‌ర్ అంటే.. ఇక టీజ‌ర్ రావ‌డానికి ఎంత‌కాలం ప‌డుతుందో అని రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్ లెక్క‌లేసుకుంటున్నారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ అయినా బాగుంటే.. అభిమానుల‌కు టీజ‌ర్ చూసినంత కిక్ ఉంటుంది. మ‌రి అదెలా ఉంటుందో చూడాలి

ALSO READ: పెనాల్టీతో స‌హా క‌ట్టేశాడు