ENGLISH

రికార్డ్స్ బద్దలు కొడుతున్న ప్రభాస్ సాలార్

21 December 2023-11:42 AM

భారత క్రికెట్ టీం లో రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే సచిన్, కోహ్లీ...  అదే సినిమాల్లో రికార్డ్స్ క్రియేట్  చేయాలంటే రెబల్  స్టార్  ప్రభాస్ మూవీ రావాల్సిందే. బాహుబలి సినిమా తో ఎవ్వరు బ్రేక్ చెయ్యలేని రికార్డ్స్ క్రియేట్ చేశాడు .  బాహుబలి  తర్వాత  రిలీజ్ అవుతున్న  ప్రతి  సినిమా పై అంచనాలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి. ఇప్పుడు  సాలార్ పార్ట్  -1  కూడా కొత్త  రికార్డ్స్ ని సొంతం చేసుకుంటుంది. 


సలార్‌ ఇప్పటికే 360 కోట్ల ప్రీ బిజినెస్  చేసుకుందని సమాచారం.  టీజర్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ రాబట్టి ఒక  వారం  ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవల బుక్  మై  షో లో  వన్  మిలియన్ ఇంట్రెస్ట్ తో రికార్డు  సృష్టించింది. ఇప్పుడు గడిచిన 24 గంటల్లో అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే ఈ సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తుంది. మరోసారి  ప్రభాస్ బాక్స్ ఆఫీస్ రారాజు అని అందరికీ గుర్తు చేసాడు. 


మాలీవుడ్‌ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్‌ కీ రోల్‌ పోషిస్తున్నాడు, శృతిహాసన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది.  కెజిఫ్  తర్వాత ప్రశాంత్  నీల్ దర్శకత్వం వహిస్తున్న సాలార్  భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సాలార్  రిలీజ్ తర్వాత  ఎన్ని రికార్డ్స్  క్రియేట్ చేస్తుందో  చూడాలి.