ENGLISH

సాలార్ vs డంకీ : బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరు?

25 December 2023-19:24 PM

గత వారం డంకీ, సాలార్ ఒక రోజు వ్యవధిలో భారీ అంచనాల మధ్య రిలీజ్  అయ్యాయి. షారూక్ ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ డంకీ కి అనుకున్న విధంగా రెస్పాన్స్ రాలేదు. అలాగే  ప్రభాస్ - ప్రశాంత్ నీల్  మూవీ  సాలార్  మిక్సీడ్ టాక్ తో మంచి  ఓపెనింగ్స్  దక్కించుకుంది. ఈ  రెండు  సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ పడుతున్నాయి.


ఇప్పటివరకు కలెక్షన్స్  చూస్కుంటే,  సాలార్  ప్రపంచ  వ్యాప్తంగా మూడు  రోజులకు గాను ₹402 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది అని  నిర్మాతలు ట్విట్టర్  హ్యాండిల్ ద్వారా  ప్రకటించారు. డంకీ  నాలుగు  రోజులకి ₹211.13  కోట్ల గ్రాస్ వసూలు  చేసింది అని  రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ  ఆఫిసిఅల్ గా  పోస్టర్  రిలీజ్ చేసింది.


 ఇక  వారాంతంలో అంతర్జాతీయ బాక్సాఫీస్‌ కలెక్షన్ చూస్కుంటే సాలార్ 3వ స్థానంలో, డంకీ 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ వసూళ్ల    లెక్కల ప్రకారం ప్రభాస్  సాలార్, షారుఖ్ డంకీ  మూవీ మీద పై చేయి సాధించింది అని  చెప్పచ్చు.