పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ గత ఏడాది కల్కితో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది రాజాసాబ్ మూవీతో అలరించనున్నాడు. రాజా సాబ్ తో పాటు ఫౌజీకి కూడా వర్క్ చేస్తున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజాసాబ్' కి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ వర్క్ చేసే సినిమాల అప్డేట్స్ ఎప్పటికపుడు ఇస్తుంటాడు. గేమ్ చేంజర్ మూవీకి ఇలాగే అప్డేట్స్ ఇచ్చి ఫాన్స్ లో జోష్ పెంచాడు. ఇపుడు ప్రభాస్ రాజా సాబ్ పై కూడా అంచనాలు పెంచుతున్నాడు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ రాజా సాబ్ మూవీ గూర్చి పలు విషయాలు చెప్పాడు. రాజాసాబ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ని జపాన్‌లో చేయనున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో జపనీస్ వెర్షన్ లో ఓ సాంగ్ చేయమని తనని మూవీ యూనిట్ కోరిందని కూడా తెలిపాడు. ఈ మధ్య తెలుగు సినిమాల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్, కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్ ని ఫారెన్ కంట్రీస్ లో చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజా సాబ్ మూవీ యూనిట్ జపాన్ లో ఆడియో లాంచ్ చేయాలనుకుంటోంది. ప్రభాస్ కి జపాన్ లో ఎక్కువమంది ఫాన్స్ ఉన్నారు. కల్కి జపాన్ వెర్షన్ జనవరి 3 న జపాన్ లో రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ కోసం ప్రభాస్ వెళ్లాల్సి ఉండగా మిస్ అయింది.
ఆ సందర్భంలో ప్రభాస్ జపాన్ వాసులకి సారీ చెప్తూ త్వరలోనే కలుస్తా అని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసమే ఇలా రాజాసాబ్ ఆడియో లాంచ్ జపాన్ లో ప్లాన్ చేసి నట్లున్నారు. ఆలు అర్జున్ కి కేరళలో ఫాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. వారిపై ప్రేమతో పుష్ప 2 లో మలయాళీ లిరిక్స్ తో ఒక పాట పెట్టించారు బన్నీ. ఇప్పుడు ప్రభాస్ కూడా జపనీస్ ఫాన్స్ కోసం జపనీస్ భాషలో ఒక పాట కోరినట్లు తెలుస్తోంది.
తమన్ మాట్లాడుతూ ఈ సినిమాపై పెద్దగా ఎవరికీ అంచనాలు లేవని అదే మంచిదని, అపుడే సినిమా హిట్ అవుతుంది అని పేర్కొన్నాడు. ఇందులో నాలుగు పాటలున్నట్లు తెలిపాడు. ఓ డ్యూయెట్, స్పెషల్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ఓ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉన్నాయన్నారు. రాజా సాబ్ కచ్చితంగా వరల్డ్ బిగ్గెస్ట్ హర్రర్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది అని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు.
ALSO READ: బాలీవుడ్ విమర్శలకీ నాగ వంశీ క్లారిటీ