ENGLISH

Salaar: ‘సలార్‌’ టీమ్ పై ప్రశాంత్‌ నీల్‌ ఫైర్

03 October 2022-16:17 PM

వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఒకవైపు ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’లో నటిస్తూనే, మరోవైపు నాగ్‌అశ్విన్‌ ‘ప్రాజెక్ట్‌-కె’ చేస్తున్నారు. ‘కేజీయఫ్‌2’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఐతే ఈ సినిమా షూటింగ్ విషయంలో ప్రశాంత్‌ అసహనంగా వున్నారు. దీనికి కారణం షూటింగ్ స్టిల్స్ లీక్ కావడం. ‘సలార్‌’కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్‌ నటించిన సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు కావడంతో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.

 

ఈ లీకేజ్ పై దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ యూనిట్ పై మండిపడ్డారని తెలిసింది. ఆన్‌లైన్‌లో లీక్‌ అవడంపై చిత్ర బృందానికి క్లాస్‌ తీసుకున్నారట. అంతేకాదు, మరో కఠిన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరూ సెట్‌లోకి మొబైల్ ఫోన్‌ తీసుకురావద్దని ఆదేశించారట. ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌ను కారావ్యాన్‌ లేదా లాకర్స్‌లో పెట్టుకుని రావాల్సిందిగా సూచించారని తెలిసింది. శ్రుతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం 2023 ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: టీజర్ : సుధీర్ బాబు డబుల్ 'హంట్'