ENGLISH

NTR30: షాకింగ్‌: కొర‌టాల అవుట్‌.. బుచ్చిబాబు ఇన్‌

04 October 2022-10:00 AM

ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత‌.. కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయాలి ఎన్టీఆర్‌. అయితే ఆ సినిమా ఇప్ప‌టి వర‌కూ ప‌ట్టాలెక్క‌లేదు. ద‌స‌రా త‌ర‌వాత‌.. షూటింగ్ ప్రారంభం అవుతుంద‌నుకొన్నారు. అయితే ఆ సంకేతాలు కూడా క‌నిపించ‌డం లేదు.

ఇప్పుడు ఏకంగా ఈ సినిమానే ఉండ‌ద‌ని టాలీవుడ్ టాక్‌. ఆచార్య‌తో కొర‌టాల శివ పూర్తిగా డౌన్ అయిపోయాడు. ఎన్టీఆర్ కూడా క‌థ‌లో మార్పులు, చేర్పులూ చెప్పాడు. ఎన్ని వెర్ష‌న్లు రాసినా.. ఎన్టీఆర్‌కి న‌చ్చ‌డం లేద‌ట‌. చివరికి ఎన్టీఆర్ కూడా... `ఈ క‌థ వ‌ద్దు.. కొత్త క‌థ చేద్దాం` అని చెప్పాడ‌ట‌. దాంతో.. కొర‌టాల ఇంకాస్త స‌మ‌యం అడిగిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌లై చాలా కాల‌మైంది. కొర‌టాల‌పై న‌మ్మ‌కంతో మ‌రో సినిమా ఒప్పుకోలేదు ఎన్టీఆర్‌. దాంతో మ‌రింత స‌మ‌యం ఇవ్వ‌డానికి ఎన్టీఆర్ ని మ‌న‌స్క‌రించ‌డం లేద‌ని టాక్‌. అందుకే కొర‌టాల కంటే ముందే ఓ సినిమా మొద‌లెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 

ఇది వ‌ర‌కే ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఎన్టీఆర్ కి ఓ క‌థ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. కొర‌టాల శివ సినిమా అయితే గానీ బుచ్చిబాబు ప్రాజెక్ట్ ముందుకు క‌ద‌ల‌దు. కాక‌పోతే.. కొర‌టాల శివ సినిమా ఆల‌స్యం అవ్వ‌డం బుచ్చిబాబుకి క‌లిసొచ్చింది. కొర‌టాల త‌ప్పుకోగానే.. బుచ్చిబాబు రంగంలోకి దిగే ఛాన్స్ వ‌చ్చింది. బుచ్చి ద‌గ్గ‌ర ఆల్రెడీ స్పోర్ట్స్ డ్రామా రెడీగా ఉంది. కాబ‌ట్టి.. ఎన్టీఆర్ బుచ్చి సినిమాని ముందుకు తీసుకెళ్లే అవ‌కాశాలు ఉన్న‌ట్టు టాలీవుడ్ టాక్‌. అదే జ‌రిగితే బుచ్చిబాబు జాక్ పాట్ కొట్టిన‌ట్టే. అదే స‌మ‌యంలో కొర‌టాల మ‌రింత డౌన్ అయిన‌ట్టే.

ALSO READ: ‘సలార్‌’ టీమ్ పై ప్రశాంత్‌ నీల్‌ ఫైర్