ENGLISH

కల్కి 2 పై నిర్మాత అశ్వనీదత్ అప్డేట్స్

16 January 2025-15:03 PM

కల్కి మూవీతో 2024లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 1000 కోట్లకి పైగా వసూల్ చేసింది. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా కల్కి రిలీజై అందరి మన్ననలు పొందింది. హాలీవుడ్‌ ఆడియన్స్ కూడా కల్కి మూవీకి ఫిదా అయిపోయారు. జనవరి 3 న కల్కి జపాన్ లో రిలీజయింది. తరవాత మిగతా దేశాల్లో కూడా రిలీజ్ చేసే  ఛాన్స్ ఉందేమో చూడాలి. భవిష్యత్తు కాన్సెప్ట్ తో పురాణాలకి లింక్ పెట్టి రూపొందించిన ఈ మూవీ ద్వారా మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు నాగ్ అశ్విన్.

అసలు కథ కల్కి 2 లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది అని సినీప్రియులు ఆసక్తిగా ఉన్నారు. మొదటి పార్ట్‌ చివర్లో మంచి సస్పెన్స్‌తో ఎండ్ చేసాడు దర్శకుడు. దీనితో సీక్వెల్ పై మరింత ఇంట్రస్ట్ పెరిగింది. కల్కి 2 షూటింగ్ ఎప్పుడు, రిలీజ్ ఎప్పుడు, ఎవరెవరు ఉన్నారు, అసలు కథ ఎవరి చుట్టూ ఉంటుంది లాంటి డౌట్స్ మొదలయ్యాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వనీ దత్ ఈ డౌట్స్ అన్నిటికి చెక్ పెట్టారు. సీక్వెల్‌ గురించి, ఎవరెవరు ఉంటారు, కథ, షూటింగ్ వీటి గూర్చి అప్డేట్స్ ఇచ్చి ఫాన్స్ కి శుభవార్త చెప్పారు.

అశ్వినీదత్‌ కల్కి 2 గూర్చి మాట్లాడుతూ 'షూటింగ్‌ 2025 ఏప్రిల్‌లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. స్క్రిప్ట్‌ రెడీగా ఉందని, అల్ రెడీ సెట్స్ వేసి ఉన్నాయి. టెక్నీకల్ గా కొత్తగా చేయటానికి ఏమి లేదని, షూటింగ్ స్టార్ట్ చేయటమే ఆలస్యం 2026 కి కల్కి 2 రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్ లో స్టోరీ మరింత డెప్త్‌గా ఉంటుందని, ముఖ్యంగా కమల్ పాత్ర సెకండ్ పార్ట్‌లో నిడివి ఎక్కువ ఉంటుంది అని, అశ్వినీదత్‌ తెలిపారు. సెకండ్‌ పార్ట్‌లో ఎక్కువగా ప్రభాస్‌, కమల్‌ కాంబో సీన్స్ ఉంటాయని, అమితాబ్‌ పాత్రకి కూడా  పర్ఫామెన్స్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. దాదాపుగా సెకండ్‌ పార్ట్‌ లో ప్రభాస్‌, అమితాబ్, కమల్‌ వీరు ముగ్గురే ఎక్కువగా కనిపిస్తారని, కొన్ని కీలక సీన్స్ లో దీపికా ఉంటుందని అన్నారు. సెకండ్‌ పార్ట్‌లో కొత్త వారు కూడా ఉంటారని స్పష్టం చేసారు.